
గూడూరు: ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దు
మోంథా తుఫాను నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని గూడూరు మండల తహశీల్దార్ రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం సాయంత్రం మాట్లాడుతూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని, ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుందని ఆమె అన్నారు. తుఫాను తీవ్రత కారణంగా అవసరం లేకుండా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నంబర్ 99086 64607కు సంప్రదించాలని తెలిపారు.








































