బంటుమిల్లి: మహా చండీ దేవిగా కనకదుర్గమ్మ

1221చూసినవారు
బంటుమిల్లి: మహా చండీ దేవిగా కనకదుర్గమ్మ
బంటుమిల్లిలోని కనకదుర్గ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు అమ్మవారు మహా చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఎప్పుడూ చల్లని చూపుతో భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు, ఆదివారం రౌద్ర రూపంలో దర్శనమిచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు తెల్లవారుజామునుంచే అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆలయ ధర్మకర్తలు తగిన ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్