మచిలీపట్నం - కత్తిపూడి 216 జాతీయ రహదారిపై మరణించిన వ్యక్తి వివరాలు తెలిశాయి. మృతుడు సంతోష్ రావు (45 ) పెడనలో రైల్వే ట్రాక్ పై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనుల వద్ద సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని మంగళవారం ఉదయం తోటమూలలోని తన ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఉదయం 5 గంటల సమయంలో పెడన సమీపంలో గుర్తుతెలియని వాహనం ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.