చాణిక్య సర్వే సంస్థ నిర్వహించిన ఎమ్మెల్యేల పనితీరు సర్వేలో కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ ఫలితాలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు శుక్రవారం బంటుమిల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్‌ను అభినందిస్తూ కేక్ కట్ చేశారు.