
పెనమలూరు: కూరగాయలకు పెరిగిన డిమాండ్
మొంథా తుపాన్ నేపథ్యంలో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. భారీ వర్షాల దృష్ట్యా 3 రోజులకు సరిపడా కూరగాయలు, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుబజార్లకు ప్రజలు క్యూ కడుతున్నారు. దీంతో కూరగాయలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. అవసరం మేర కూరగాయలు రాకపోవడంతో ప్రజలు మంగళవారం ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు రకాల కూరగాయలు మాత్రమే రైతుబజార్లలో అందుబాటులో ఉన్నాయి.




































