ఊయ్యురు: నిర్వాహకులకు సీఐ హెచ్చరిక

1264చూసినవారు
వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఊరేగింపులు నిర్వహించే నిర్వాహకులకు ఉయ్యూరు సీఐ రామారావు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం ఉయ్యూరులో ఆయన మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు ఊరేగింపులలో రాజకీయ నాయకుల పేర్లతో కులముద్ర వేస్తూ, దేవుని పాటలకు బదులుగా కులాలకు సంబంధించిన పాటలు పెట్టి, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఊరేగింపులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్