పెనమలూరు నియోజకవర్గంలో బుడమేరు వరద కారణంగా ఏర్పడిన గండ్లను పూడ్చాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. విజయవాడకు దిగువన ఉన్న తమ నియోజకవర్గంలో మూడు చోట్ల బుడమేరు కట్ట తెగి గ్రామాల్లోకి నీరు వ్యాపించిందని, ఇప్పటికీ ఆ గండ్లను పూడ్చలేదని ఆయన తెలిపారు. క్లౌడ్ బరస్ట్ వంటి సంఘటనలు జరిగితే లోతట్టు ప్రాంతమంతా మునిగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.