భూ సమీకరణ ప్రక్రియలో 90 శాతం మంది రైతులకు డబ్బులు చెల్లించినా, మిగిలిన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, భూములు ప్రభుత్వ అధీనంలో ఉండటంతో రైతులు వ్యవసాయం చేసుకునే అవకాశం లేకుండా పోయిందని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ కు కూడా పునరావృతంగా విజ్ఞప్తులు చేసినట్లు తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.