ఉయ్యూరు: కోలాహాలంగా వినాయక నిమజ్జనం

52చూసినవారు
ఉయ్యూరులోని కాటూరు రోడ్డు చింతతోటలో ఆదివారం సాయంత్రం జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా పిల్లల డ్యాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. పెద్దల సహాయం లేకుండా పిల్లలే గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తీసుకెళ్లారు. తీన్మార్ డప్పుల శబ్దాలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ వినాయకుడికి వీడ్కోలు పలికారు. గొడవలు, కేకలు లేకుండా ఆహ్లాదకరంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్