గంపలగూడెం మండలం పెనుగొలను 99వ అంగన్వాడి కేంద్రంలో రెండవ రోజు శనివారం సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా మహిళలు అంగన్వాడీ కార్యకర్త కే. లింగమ్మ, సహాయకురాలు దేవర రామాంజనమ్మ (అంజలి) సేవలను గుర్తిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు గ్రామస్తులు పాల్గొన్నారు.