తల్లిపాలే శిశువులకు అమృతం..అంగన్వాడి సూపర్వైజర్

2చూసినవారు
తల్లిపాలే శిశువులకు అమృతం..అంగన్వాడి సూపర్వైజర్
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం మేడూరు అంగన్వాడి కేంద్రంలో బుధవారం జరిగిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ ఏ. చైతన్య భవాని మాట్లాడుతూ శిశువుల మానసిక, శారీరిక ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత అవసరమని తెలిపారు. జన్మించిన వెంటనే శిశువులకు ముర్రి పాలు పట్టించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఎదుగుతారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్