అడవి బాపిరాజు వర్ధంతి వేడుకలు

11చూసినవారు
అడవి బాపిరాజు వర్ధంతి వేడుకలు
గంపలగూడెం మండలం పెనుగొలనులో మంగళవారం బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత అడవి బాపిరాజు 74వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బాపిరాజు వివిధ రంగాల్లో చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా సాయిబాబా కమిటీ సభ్యులు సన్నాయి, డోలక్, హార్మోనియం కళాకారులు అగు జిడుగుకొండ, మంచి కంటి నర్సింహారావు, పొనుగుపాటి శ్రీను, జిడుగు ఉపేంద్ర, పొనుగుపాటి కిట్టయ్య లకు జ్ఞాపికలు అందజేసి నూతన వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్