గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (శ్రీపతి పండిత రాధ్యుల బాలసుబ్రమణ్యం) ఆరవ వర్ధంతి శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగు భాషతో కలుపుకొని16 భాషల్లో 40, 000 పాటలను పైగా పాడారని వక్తలు తెలిపారు.