గంపలగూడెం మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం

17చూసినవారు
గంపలగూడెం మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం
గంపలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పెనుగొలను గ్రామంలో అంగన్వాడి, సచివాలయ, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వికలాంగులకు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్, తిరువూరు ప్రాంతాల్లో జరుగుతోంది.