మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

1777చూసినవారు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
గంపలగూడెం మండలం పెనుగొలనులో ఆదివారం మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 105వ జయంతి వేడుకలు శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల దేశం అభివృద్ధి పథంలో నడిచిందని వక్తలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధానమంత్రిగా నరసింహారావు నిస్వార్ధంగా పనిచేశారని కీర్తించారు.

సంబంధిత పోస్ట్