పెనగొలనులో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు

9చూసినవారు
పెనగొలనులో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులోని గంపలగూడెం మండలంలో పెనుగొలను 99వ అంగన్వాడి కేంద్రంలో సోమవారం అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు జయంతిని శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురజాడ తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచారని టీచర్ కే లింగమ్మ తెలిపారు. పెనుగొలను హైస్కూల్లో, గ్రంథాలయంలో కూడా గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్