గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద బుధవారం సినీ నటుడు, పార్లమెంట్ సభ్యుడు, నందమూరి హరికృష్ణ 70వ జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హరికృష్ణ చలనచిత్ర నటుడుగా, నిర్మాతగా, హిందూపురం శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజా సేవలో తనదైన ముద్ర వేశారని వక్తలు తెలిపారు. నందమూరి హరికృష్ణ తన తండ్రి
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు "చైతన్య రథం" కు సారథిగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి లక్షలాది కిలోమీటర్లు ప్రయాణించి అందించిన సేవలు చిరస్మరణీయ మైనవి అని కొనియాడారు.