గంపలగూడెం మండలం పెనుగొలనులో సోమవారం స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ 1935లో అణగారిన వర్గాల హక్కుల కోసం "ఆల్ ఇండియా డిప్రెస్డ్ లీగ్"ను స్థాపించారని, దాదాపు 30 ఏళ్లకు పైగా కేంద్ర మంత్రిగా నిస్వార్థంగా పనిచేసి, కేంద్ర ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.