ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం వేడుకలు

2303చూసినవారు
ఘనంగా జాతీయ గణాంక దినోత్సవం వేడుకలు
గంపలగూడెం మండలం, పెనుగొలను గ్రంథాలయంలో సోమవారం జాతీయ గణాంక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆధునిక భారత గణాంక పితామహుడు ప్రొ. ప్రశాంత చంద్ర మహలనోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం జూన్ 29న మహలనోబిస్ జయంతిని దేశవ్యాప్తంగా జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటున్నామని వక్తలు తెలిపారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, కాన్వెంట్ ప్రిన్సిపాల్ తోట నాగరాజు, వనమా రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్