గంపలగూడెం మండలం పెనుగొలనులో బుధవారం
జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో
జనసేన పార్టీని స్థాపించారని వక్తలు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల మన్ననలు పొందుతున్నారని కీర్తించారు.