పెనుగొలను ప్రాథమిక సహకార సంఘం స్టాప్ అసిస్టెంట్ నాగేశ్వరరావుకు ఘన సన్మానం

459చూసినవారు
పెనుగొలను ప్రాథమిక సహకార సంఘం స్టాప్ అసిస్టెంట్ నాగేశ్వరరావుకు ఘన సన్మానం
గంపలగూడెం మండలం పెనుగొలను ప్రాథమిక సహకార సంఘంలో స్టాప్ అసిస్టెంట్ గా పనిచేసి మంగళవారం పదవి విరమణ చేయనున్న రాయల నాగేశ్వరరావును శిరిడి సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. సొసైటీ కౌంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు సేవలను కొనియాడుతూ జ్ఞాపికలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షులు నాగళ్ళ మురళి, విశ్రాంత బ్యాంకు మేనేజర్ దేవరపల్లి రమేష్, సీఈఓనామా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.