అమ్మి రెడ్డి గూడెంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం

3326చూసినవారు
అమ్మి రెడ్డి గూడెంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెం 86వ అంగన్వాడి కేంద్రంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం శనివారం జరిగింది. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు అంగన్వాడీ కార్యకర్త డి. వెంకట్రావమ్మ, సహాయకురాలు టి. మమత ను వారి సేవలు గుర్తిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం. రమాదేవి, ఆశ కార్యకర్తలు, మహిళలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్