చిన్న కొమిరలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం

9చూసినవారు
చిన్న కొమిరలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం చిన్న కొమిర అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ ఏ. ఉషారాణి చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్