అంగన్వాడి కేంద్రానికి నీటి సౌకర్యం

1చూసినవారు
గంపలగూడెం మండలం పెనుగొలను బోటిమీద ఉన్న అంగన్వాడి కేంద్రానికి గత కొంతకాలం నుంచి నీటి సౌకర్యం లేక ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవల ఈ సమస్యను అంగన్వాడి సిబ్బంది స్థానిక టిడిపి నాయకులు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సమస్యకు స్పందించి కొత్తగా పైపులు వేసి నీటి సౌకర్యం కల్పించినట్లు అంగన్వాడి టీచర్ ఎం. స్వరూప రాణి సోమవారం తెలిపారు. ఈ సమస్య పరిష్కారమైనందుకు అంగన్వాడి సిబ్బంది, చిన్నారులు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్