బాపట్ల జిల్లా చీరాలలో మచిలీపట్నానికి చెందిన సుబ్బారావు, ఈశ్వరమ్మ దంపతుల 6 నెలల కుమారుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఈశ్వరమ్మ గురువారం తన పక్కన పడుకోబెట్టుకున్న శిశువును గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. SP ఆదేశాల మేరకు DSP మహమ్మద్ మోయిన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టాయి.