గుణదలకు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుబడుల పేరుతో వచ్చిన రీల్‌ను నమ్మి సైబర్ మోసగాళ్ల బారినపడి రూ.89 వేలు కోల్పోయింది. భారీ లాభాలు వస్తాయని నమ్మించి, సెక్యూరిటీ డిపాజిట్, జీఎస్టీ, వాలెట్ యాక్టివేషన్ ఫీజు వంటి పేర్లతో డబ్బులు వసూలు చేశారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయగా, మాచవరం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.