విజయవాడలో దారుణ హత్య జరిగింది. మద్యం తాగే చోటుతో వచ్చిన వివాదం హత్యకు దారితీసింది. రామవరప్పాడుకు చెందిన వైకుంఠం కొత్త సంవత్సరం రోజు ఓ శ్మశాన వాటికలో మద్యం తాగేందుకు వెళ్లాడు. అయితే రోజు వైకుంఠం తాగే చోట సాయి అనే వ్యక్తి ఉండడంతో గొడవపడ్డాడు. విషయం తెలుసుకున్న భార్య ఇంటికి తీసుకురాగా.. మళ్లీ వైకుంఠం బయట వెళ్లాడు. మరో సారి ఘర్షణ పడడంతో సాయి కత్తితో హత్య చేశాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.