కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం

7చూసినవారు
కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం
విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో ప్రేమించిన యువతి మహాలక్ష్మిపై చిన్నారావు అనే యువకుడు బ్లేడ్‌తో దాడి చేసి గొంతు కోశాడు. మరో వ్యక్తితో మాట్లాడుతోందనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం చిన్నారావు భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన మహాలక్ష్మిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఈ ఘటనపై అజిత్ సింగ్ నగర్ సీఐ విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్