విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ గా చరిత్రాత్మక విజయం సాధించిన
జనసేన పార్టీ అభ్యర్థి వంగవీటి రాధా ను పూజిత మహిళా సొసైటీ ప్రెసిడెంట్ కోటేశ్వరి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కారించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మిపై1, 30, 872ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి, తన పుట్టినరోజు నాడే మేయర్ పీఠాన్ని అధిష్టించడం వంగవీటి రాధా జీవితంలో మరపురాని ఘట్టమని కోటేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోటేశ్వరి మాట్లాడుతూ "విజయవాడ ప్రజలు వంగవీటి రాధా పై చూపిన అపార నమ్మకానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. మహిళా సాధికారత, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనలో ఆయన ముందుంటారని ఆశిస్తున్నట్లు తెలిపి పూజిత మహిళా సొసైటీ తరపున ఆయనకు హృదయపూర్వక అభినందనలు చెప్పారు.