విజయవాడ రామవరప్పాడులో 8వ తరగతి బాలికపై అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25న బాలిక కడుపునొప్పితో బాధపడుతుండటంతో తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె 3 నెలల గర్భవతి అని తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ACP దామోదర్ కేసు నమోదు చేశారు. మరోవైపు, ఉయ్యూరుకు చెందిన బాలికపై మరో బాలుడు అత్యాచారం చేయగా కంకిపాడు CI రవికుమార్ పోక్సో కేసు నమోదు చేశారు.