రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షేక్ ఖాజా బుధవారం వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ (
వైసీపీ)కి రాజీనామా చేశారు. విజయవాడ భవానీపురానికి చెందిన ఖాజా, ముస్లిం మైనారిటీలకు సేవ చేస్తున్నానని, తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. రాజీనామాకు గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.