
పాఠశాలలో మధ్యాహ్న భోజనం దుస్థితి: దుమ్ముతో పాటు వడ్డన
విజయవాడలోని సెంట్రల్, దుర్గపురం శ్రీ టీ. వెంకటేశ్వరావు నగరపాలకశంస్థ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని బయట మైదానంలో వడ్డిస్తున్నారు. పిల్లలు ఆడుకునే చోటే భోజనం వడ్డించడం, గిన్నెలకు మూతలు లేకపోవడంతో దుమ్ము పడుతోందని, పిల్లలు అలాగే తింటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని, ఈ విషయం ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతున్నారు.






























