ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

0చూసినవారు
ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రేమోన్మాది చిన్నా (22) తన ప్రియురాలు మహాలక్ష్మి (19)పై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం సమీపంలోని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఏడాది క్రితమే అతనితో ఆమె పెళ్లి వద్దనుకోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. యువతి పని చేస్తున్న బట్టల షాప్ వద్దకు వెళ్లి బీరు సీసాతో తల పగలకొట్టుకున్నాడని నన్నే కాదంటావా అని కొట్టాడని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్