సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

7చూసినవారు
సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు
సాయికృష్ణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో అనుమానాస్పద మరకలను సిట్ గుర్తించింది. లాఠీ, ఎముకలు, కాలిపోయిన బూడిద, ఇనుప గొలుసును స్టేషన్ టెర్రస్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. సాయికృష్ణ కస్టడీలో తీవ్ర గాయాలతో మృతి చెందాడని కొందరి స్టేట్మెంట్ల ఆధారంగా సిట్ గుర్తించింది. మృతదేహాన్ని ఏం చేశారనే విషయాన్ని కస్టడీకి అనుమతిస్తే నాగరాజును తీసుకువెళ్లి గుర్తిస్తామని సిట్ పేర్కొంది. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన మెమోలో ఈ కీలక విషయాలను సిట్ కోర్టుకు తెలిపింది.