విజయవాడ తూర్పు నియోజకవర్గం మూడవ డివిజన్ కనకదుర్గ నగర్ లో నాలుగు లక్షల 50 వేల రూపాయలతో అధునాతన ఎల్ఈడి లాంప్ లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సోమవారం ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎల్ఈడి ల్యాంప్ వస్తున్నాయి అంటే అందరూ ఆ ఏముందిలే అనుకున్నారు కానీ ఈరోజు ఏ స్ట్రీట్ చూసినా ఏ వాహనం చూసినా ఎల్ఈడీ లైట్స్ కలిగి ఉన్నాయని విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న టెక్నాలజీని అందించుకుంటున్నారని అన్నారు. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాంతినిస్తాయని దీనివల్ల కరెంటు ఆదా అవుతుందని అన్నారు.