విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆదివారం
ఎన్టీఆర్, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలోని 12వ డివిజన్లో ప్రజా సమస్యలపై స్పందించారు. భారతదేశంలోనే తొలిసారిగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నమెంట్ ను ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని, గత ప్రభుత్వం వేయని రోడ్లను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని తెలిపారు.