విజయవాడ కృష్ణలంకలోని ఏపీ ఆర్ ఎస్ ఎం స్కూల్ అండ్ కాలేజీలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రెండు జతల యూనిఫాంలను అందజేశారు. ఈ కళాశాల
ఎన్టీఆర్ జిల్లాలోనే అత్యుత్తమ కళాశాలగా గుర్తింపు పొందిందని, అధ్యాపకులు, విద్యార్థుల సమిష్టి కృషితో 900 పైగా మార్కులు సాధించారని ఆయన తెలిపారు. కళాశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో విద్యావ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు.