విజయవాడలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా, మాజీ సీఐ నాగరాజుకు మద్యం సిండికేట్‌తో సంబంధాలున్నాయనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. పాయకాపురానికి చెందిన శ్రీను అనే వ్యక్తితో నాగరాజుకు ఆర్థిక లావాదేవీలతో పాటు, మద్యం వ్యాపారంలో వాటాల భాగస్వామ్యం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.