టీసీఎస్ ఎన్‌క్యూటీ (నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్) పరీక్షకు సిద్ధమవుతున్న
విద్యార్థులు, ఉద్యోగార్థుల కోసం విజయవాడలోని అప్‌టెక్ సొల్యూషన్స్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తోంది. కేవలం రూ.999 ఫీజుతో నిర్వహిస్తున్న ఈ శిక్షణలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌తో పాటు సాంకేతిక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్, ప్రోగ్రామింగ్ బేసిక్స్‌పై పరీక్షకు అనుగుణంగా ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని సంస్థ తెలిపింది. మాక్ టెస్టులు, డౌట్ సెషన్స్, రియల్ ఎగ్జామ్ సిమ్యులేషన్, ప్లేస్‌మెంట్ సపోర్ట్ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
టీసీఎస్ ఎన్‌క్యూటీ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 2 చివరి తేదీ కాగా, పరీక్ష సెప్టెంబర్ 14న జరగనుంది. విజయవాడ గవర్నర్‌పేటలోని మహేశ్వరి ప్యాలెస్, 3వ అంతస్తులో అప్‌టెక్ సొల్యూషన్స్ కార్యాలయం ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 9177866999, 9392474295 నంబర్లలో సంప్రదించవచ్చు.