ఏపి ప్రభుత్వం కృష్ణా నది పరివాహక ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులకు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. నది ప్రయాణాలు, చేపలు పట్టడం వంటివి చేయరాదని సూచించారు. అటు మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు ప్రాథమిక అంచనా వేశారు. తుఫాను వల్ల ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. పరిపాలన, సంసిద్ధత, సాంకేతిక పరిజ్ఞానం వల్ల నష్టాన్ని తగ్గించగలిగామని సీఎం పేర్కొన్నారు.