
మైలవరం
మైలవరంలో వివాదం.. లారీ డ్రైవర్ వ్యక్తి పై స్కూడ్రైవ్ తో దాడి
మైలవరంలో గురువారం లారీ డ్రైవర్ రిక్షా డ్రైవర్‌పై దాడి చేశాడు. మైలవరం-తిరువూరు వెళుతున్న లారీకి రిక్షా అడ్డు రావడంతో ఈ వివాదం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ స్కూడ్రైవర్‌తో దాడి చేయడంతో లక్ష్మయ్య అనే రిక్షా డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.

































