Mar 09, 2026, 12:03 IST/
సాంబార్ విషయంలో గొడవ.. భార్య ఆత్మహత్య
Mar 09, 2026, 12:03 IST
బెంగుళూరులో సాంబార్ వంటకంపై జరిగిన వాగ్వాదం ఓ మహిళ ప్రాణాలు తీసింది. 27 ఏళ్ల కావ్య అనే యువతి, తన భర్త రంగస్వామి ఇంట్లో విందు కోసం వండిన సాంబార్‌ను మూడు రోజుల పాటు మళ్లీ మళ్లీ వడ్డిస్తున్నాడని భర్త ఆరోపించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన కావ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.