Apr 12, 2026, 12:04 IST/
చేపలవేటకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి
Apr 12, 2026, 12:04 IST
AP: అల్లూరి జిల్లా పెదబయలు మండలం సికరి పంచాయతీ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మత్యగెడ్డలో చేపల వేటకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతి చెందిన వారు కోడా ప్రదీప్(9), పాంగి శ్రీను(10), జల్లుంగి అర్షిత్(10) గా గుర్తించారు. అయితే ఈ ఘటనలో మరో బాలుడిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.