అవనిగడ్డలో మంత్రి అంబటి రాంబాబుపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, శనివారం సాయంత్రం అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అనంతరం అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నిరసనలో టీడీపీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.