మధ్యవర్తిత్వం ద్వారా చిన్న కేసులు పరిష్కారం చేసుకోవాలని అవనిగడ్డ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, సబ్ డివిజన్ జడ్జి జస్టిస్ కే. అరుణ సూచించారు. సోమవారం అవనిగడ్డ కోర్టులో మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వీ. స్వర్ణలత, ఏజీపీ ఈశ్వరరావు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.