ఎన్. డీ. ఏ ప్రభుత్వం ఏర్పడటంతో నియోజకవర్గంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరుగుతోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం అవనిగడ్డలోని స్టేట్ బ్యాంకు రోడ్డు వద్ద కరకట్ట-అశ్వారావుపాలెం రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆర్. అండ్. బీ శాఖ ద్వారా ఎండీఆర్ ప్లాన్ నిధులు రూ. 4. 50 కోట్లతో ఈ రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.