పేదరిక నిర్మూలనకు దాతల భాగస్వామ్యం ఆదర్శనీయమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం అవనిగడ్డ రెవిన్యూ హాలులో పీ-4 "ఆకాంక్ష నుంచి సాధన" స్వర్ణ ఆంధ్ర - 2047 సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమం పేదల అవసరాలు తీర్చడంతో పాటు అభివృద్ధిలోనూ భాగస్వామ్యం వహిస్తోందని తెలిపారు.