అవనిగడ్డ: భారీగా రేషన్ బియ్యం స్వాధీనం

1చూసినవారు
అవనిగడ్డ: భారీగా రేషన్ బియ్యం స్వాధీనం
శనివారం అవనిగడ్డలో పోలీసులు భారీగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాత్రి గస్తీ సమయంలో రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, కోడూరు నుంచి అవనిగడ్డ వైపు వస్తున్న AP39UA5189 నంబర్ గల వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1250 కిలోల రేషన్ బియ్యాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె. శ్రీనివాస్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్