మంత్రి వాసంశెట్టి సుభాష్ పై మాజీ సీఎం జగన్ అహంకారపూరిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు శుక్రవారం అవనిగడ్డలో మండిపడ్డారు. సంక్రాంతి వేడుకలపై మంత్రిని లక్ష్యంగా చేసుకుని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతలు ఎదుగుతుంటే ఓర్వలేకనే ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బీసీలకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.