అవనిగడ్డ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల కల్పనపై సోషల్ మీడియాలో వచ్చిన కథనాలకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు స్పందించారు. బుధవారం వారు ఆసుపత్రి పరిసరాలను, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, మంచినీటి, ఆహార పదార్థాల తయారీని ఆరా తీశారు. సరిగా సౌకర్యాలు కల్పించడం లేదంటూ వచ్చిన ఆరోపణలపై అధికారులు దృష్టి సారించారు.